Sunday, January 8, 2012

తెలుగు భాష మేలు కోరి ప్రయత్నమ్ము సేయరా

తెలుగు వాడ లేవరా
తలుపుతట్టి లేపరా
తెలుగు భాష మేలుకోరి
ప్రయత్నమ్ము  సేయరా
 
నీ భాష
నీ మాట
తీయని ఒక పండురా 
చక్కటి మకరందమ్మురా
 
కమ్మనైన భాష
కడు తేలికైన భాష
లెస్స భాషగా
రాయలు వర్ణించిన  భాష
 
లెక్కలైనగాని
శాస్త్ర సిద్ధాంతములైనగాని
వ్యాధులైనగాని
వ్యవస్థలైనగాని
 
నేర్చుకోరా తెలుగులో
మాతృభాష కొలువులో
తెలుగు పుస్తకాలలో
తెలుగు వర్ణమాలలో
 
 
నారాయణ రావు కంభంపాటి
కాకినాడ
28.10.2011
 
 
తెలుగు కవితలు

No comments:

Post a Comment