Sunday, January 8, 2012

ఉగాది పండుగ వచ్చిందంటే - సరదా, సందడి, సంతోషములు

పండుగ లండీ  పండుగలూ
సరదా, సందడి, సంతోషములు

ఉగాది పండుగ వచ్చిందంటే
వేప-మామిడి పచ్చడి    చేస్తాం

శ్రీ రామనవమి వచ్చిందంటే
సీతా రాముల పెళ్లి చేస్తాం

శివరాత్రి వచ్చిందంటే
శివ   శివ  అని జాగారం చేస్తాం

గణపతి చవితి వచ్చిందంటే
గరికె, గడ్డి ఏరి తెస్తాం

కృష్ణాష్టమి వచ్చిందంటే
ఎత్తుకు ఎగిరి ఉట్టిని కొడతాం

దసరా పండుగ వచ్చిందంటే
దాన్సులెన్నో దండిగా చేస్స్తాం

దీపావళి వచ్చిందంటే
ఇల్లంతా దీపా లెడతాం

నాగుల చవితి వచ్చిందంటే
పాలెన్నో పుట్టలో  పోస్తాము

సంక్రాంతి  వచ్చిందంటే  సిరులెన్నో తెచ్సిందంటే
బూర్లు  గార్లు దండిగా చేస్తాం

పండుగ లండీ  పండుగలూ
సరదా, సందడి, సంతోషములు
__________________________________________________

ఉగాది పండుగ 

ఉగాది పండుగ వస్తోంది
ఉత్సాహాన్ని తెస్తోంది
ఊరంతా సంతోషం
ఉరకలు వేసే సందోహం

ఉప్పు, పులుపు, చెరుకు, చేదు
ఉపాహారం ఈ రోజు ప్రత్యేకం 
ఉదయం తలంటు పోత
ఉత్సాహం కొత్త బట్టల జత 

ఊరి దేవత సంబరం
ఉత్కంట గొలిపే వినోదం 
ఉగాది పంచాంగ శ్రవణం
ఊరట ఇచ్చే గోచారం వివరం

ఉంది ఉంది మంచి పొంచి  
ఉన్నది గ్రహాల బలం
ఊరికి కొంచెం ఉపకారం 
ఉగ్ర గ్రహాల శాంతికి దానం

ఉన్నత స్థితికి సోపానం
ఉద్వాసన - ఇబ్బందులు మాయం
ఉగాది పండుగ ధ్యేయం 
ఉత్సాహాన్ని పెంచడం




No comments:

Post a Comment