నేను పుట్టాను
ఏమి చేసాను
నా కోసం ఈ లోకం
ఏదో ఎందుకు చెయ్యాలి
షుడ్ ఐ కేర్ || నేను పుట్టాను||
ప్రశ్న వేసింది
తట్టి లేపింది
జీవంలో ఏ మూలో ఉన్న
ఆత్మ ఏదో || నేను పుట్టాను||
ధర్మం నేర్చావా
అర్ధం వచ్చిందా
సాయం చేసావా
నువ్వే తిన్నావా || నేను పుట్టాను||
వయస్సు ఏమో పెరిగిపోతోంది
ఆయుస్సు ఏమో తరిగిపొతోంది
ఆలోచన ఏమైనా ఇప్పుడు చేస్తావా
అప్పులు కొన్నైనా తీర్చివేస్తావా || నేను పుట్టాను||
(c) Narayana Rao K.V.S.S. 2018
6 July 2018
8.00 am in the Bus from Thane to L & T
No comments:
Post a Comment