Tuesday, July 24, 2018

Govinda ,Govinda , Govinda anandi - గోవింద గోవింద గోవింద అనండి



Govinda ,Govinda , Govinda  anandi

గోవింద గోవింద గోవింద  అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి

పిలిచిన వారికి పలికెడి దేవుడు
మ్రొక్కిన వారికి వరాలిచ్చు రాయుడు

గోవింద గోవింద గోవింద  అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి

చూసిన వారికి కలుగును శాంతి
కళ్యాణము చేసిన వారికి ఎనలేని శుభము

గోవింద గోవింద గోవింద  అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి

తలనీలాలకే తరగని సిరులిచ్చు
కాసిని కాసులకు కామధేనువునిచ్చు

గోవింద గోవింద గోవింద  అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి


నడచిన వారికి కార్యము సఫలము
నామస్మరణము నిత్యము శుభము

గోవింద గోవింద గోవింద  అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి

సుప్రభాతము శుభముకు బాట
పవళింపు పాట ఫలముల మూట

గోవింద గోవింద గోవింద  అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి

నారాయణ రావు
24 జూలై 2018

No comments:

Post a Comment