Saturday, February 3, 2018

శివ రాత్రి వచ్చింది శివుడా శివుడా





____________________

____________________



శివ రాత్రి వచ్చింది శివుడా శివుడా
భవరాశి పిలిచింది శివుడా శివుడా

ధనమధనం జరిగింది శివుడా శివుడా
నరమరణం  పెరిగింది శివుడా శివుడా
దోపిడీలు జరిగాయి శివుడా శివుడా
గరళ జనన మయ్యింది శివుడా శివుడా

ఇళ్లెన్నో కూలాయి శివుడా శివుడా
ఒళ్లెన్నో కాలాయి శివుడా శివుడా
ప్రాణ భీతి పెరిగింది శివుడా శివుడా
జనం పరుగు లెట్టింది శివుడా శివుడా

రాయుడు, రెడ్డి, రాజు రాలేదయ్యా
శర్మ, శాస్త్రికి మాత్రం ఏం తెలుసయ్యా
శ్రేష్టి గారి డబ్బుకి విలువేదయ్యా
మా కండబలం ఎంతవరకు ఆపేదయ్య ||శివ రాత్రి వచ్చింది

కాపాడు మా తండ్రి కాపాడయ్యా
కష్టాలను తొలగించి కాపాడయ్యా
పాపాలు చేసాము కాపాడయ్యా
ప్రాయశ్చిత్తం ఏమిటో మాకు చెప్పయ్యా ||శివ రాత్రి వచ్చింది


ఉపవాసాల్ చెయ్యలా
ఊళ్లెన్నో తిరగాలా
నదులలో ములగాలా
ధర్మాలే వినాలా


దోచుకున్న డబ్బంతా దానాలే చెయ్యలా
దాచుకున్న డబ్బంతా హుండిలో వెయ్యాలా
మాకు దిక్కు మా నేతకు దిక్కు నువ్వేనయ్యా
కైలాసం దిగి నువ్వు రావాలయ్యా ||శివ రాత్రి వచ్చింది


రక్షించు రక్షించు శివుడా శివుడా
గరళం భక్షించు భక్షించు శివుడా శివుడా
తప్పులన్నీ తెలిసాయి శివుడా శివుడా
నువ్వు చెప్పినవన్నీ చేసాము శివుడా శివుడా

శివ రాత్రి వచ్చింది శివుడా శివుడా
భవరాశి పిలిచింది శివుడా శివుడా


నారాయణ రావు కంభంపాటి

తెలుగు కవితలు
10 నవంబర్ 2011

First published in
Knol 5932

Updated on 4 February 2018

No comments:

Post a Comment