పిల్లలము బడి పిల్లలము
ఒకటవ తరగతి పిల్లలము
అమ్మ, అత్తా
ఆవు, ఆకు
మాటలెన్నో చెప్పెదము
మంచి మాటలెన్నో నేర్చెదము
అ, ఆ, ఇ, ఈ
అక్షరాలను చక్కగా దిద్దెదము
పలకా, బలపం
చేత పట్టుకుని పదాలెన్నో వ్రాసెదము
ఒకటి, రెండు
మూడు, నాలుగు
అంకెలు లెక్క పెట్టెదము
మేమెందరమో తెలియ చెప్పెదము
ఒకటి, ఒకటి, రెండూ అంటూ
కూదికలెన్నో చేసెదము
రెండు పళ్లలో ఒకటి తింటే
మిగిలన దొకటే నని తెలి పెదం
రెండు రెళ్ళు నాలుగు
రెండు మూళ్లు ఆరు
ఎక్కాలెన్నో చదివెదము
లెక్కలు చక్కగా చేసెదము
నారాయణ రావు
కాకినాడ
No comments:
Post a Comment