Sunday, December 25, 2011

శ్రీ వెంకటేశ్వర దర్శనం దివ్యానందం - గేయము

ఏడుకొండలవాడా వచ్చామయా
నీ దర్శన భాగ్యం మాకు ఇవ్వాలయ్యా
ఏడుకొండ లెక్కి వచ్చామయ్యా
ఏడు కాసులు హుండీకి తెచ్చామయ్యా

వడ్డికాసుల వాడా
వరాలిచ్చే వాడా
నీ దర్శనం దివ్యానందం
నీ అంగ దర్శనం సర్వానందం
నీ దర్శనం దివ్యానందం

నీ శిరదర్శనం జ్ఞానానందం
నీ ముఖ దర్శనం సౌన్దర్యానందం
నీ ఫాల దర్శనం జ్ఞాపకానందం
నీ నేత్ర దర్శనం నేత్రానందం
నీ దర్శనం దివ్యానందం

నీ కర్ణ దర్శనం శ్రవణానందం
నీ ఘ్రాణ దర్శనం సువాసనానందం
నీ అధర దర్శనం మందస్మితానందం
నీ జిహ్వ దర్శనం జిహ్వానందం
నీ దర్శనం దివ్యానందం

నీ కంఠ దర్శనం ఆభరణ ఆనందం
నీ వక్ష దర్శనం ఆలింగన ఆనందం
నీ కర దర్శనం కార్యానందం
నీ హస్తముద్ర దర్శనం దానానందం
నీ దర్శనం దివ్యానందం

నీ ఉదర దర్శనం ఆహారానందం
నీ ఊరు దర్శనం ధారుడ్య ఆనందం
నీ జంఘ దర్శనం చలనానందం
నీ పాద దర్శనం శరణానందం
నీ దర్శనం దివ్యానందం

ఏడుకొండలవాడా వచ్చామయా
నీ దర్శన భాగ్యం మాకు ఇవ్వాలయ్యా



నారాయణ రావు కంభంపాటి
థానే
నవంబర్ 2011

Originally posted in
http://knol.google.com/k/-/-/2utb2lsm2k7a/5925

No comments:

Post a Comment