ఉల్లాసంగా ఉత్సాహంగా పదండి తిరుమలగిరికి
వరముల పెన్నిధి పురికి
సిరివరముల స్వామికి దరికి
పదండి ముందుకు పైపైకి
ఏడుకొండలు ఎక్కవలెనయా
గోవిందుడి భజనలు చేయ వలెనయా
కొండ కొండకు కథ కలదు
విన్న వాళ్ళకు శ్రమ లేదు ||ఉల్లాసంగా ఉత్సాహంగా
ఇదే శేషశైలము
శేషాచలము
ఆదిశేషుని అవతారము
తిరుమల మోసే ఘన శిరము ||ఉల్లాసంగా ఉత్సాహంగా
విష్ణుదేవుని వాహనమితడే
భూమికి భువికి సేతువు ఇతడే
వైకుంట పురికి సాధన మితడే
గరుడా చలముగా విలసిల్లునతడే ||ఉల్లాసంగా ఉత్సాహంగా
కష్టములను కట కట త్రెంచే
నాధుడు వెంకట ఈశ్వరుడు
వెంకటాద్రి విశ్రాంతి మెట్లివే
కావుము కావుము స్వామీ అంటూ కూర్చుని లెండు కాసేపు ||ఉల్లాసంగా ఉత్సాహంగా
నరజన్మ తరనోపాయం
నారాయణ ఉపాఖ్యానం
గీతోపదేశ ఉచ్చ స్థానం
నారాయణాద్రి మకుట స్థానం ||ఉల్లాసంగా ఉత్సాహంగా
శివుని వాహనం
చిత్ర విచిత్రం
వేంకటేశ్వరుని ఆసనం
వృషభాద్రి నామ అచలం ||ఉల్లాసంగా ఉత్సాహంగా
వృషాద్రి సోపానం
కరివరదుడి కటాక్షం
తిరుమల దర్శనం
మీ కోరిక సాఫల్యం ||ఉల్లాసంగా ఉత్సాహంగా
ఏడుకొండలవాడి దివ్య ధామం
మ్రొక్కి వచ్చిన వైకుంఠ ధామం
కొండలలో కోనేటి రాయని ప్రాసాదం
తిరుమలకొండా శరనిచ్చే అండా ||ఉల్లాసంగా ఉత్సాహంగా
ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చేసారు దరికి
పాపాలను కడిగే కోనేటికి
వరాహ స్వామి గుడికి
పదండి ముందుకు కదలి ||ఉల్లాసంగా ఉత్సాహంగా
వరములనిచ్చే స్వామి
సిరివరములనిచ్చే దేవి
ఎదురుగ నిలబడి కోరి
పొందర జన్మకి ముక్తి ||ఉల్లాసంగా ఉత్సాహంగా
నారాయణ రావు కంభంపాటి
థానే
31.10 . 2001
హైదరాబాదు నుండి ముంబాయి దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలులో
First posted in
http://knol.google.com/k/-/-/2utb2lsm2k7a/5926
No comments:
Post a Comment