Govinda ,Govinda , Govinda anandi
గోవింద గోవింద గోవింద అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి
పిలిచిన వారికి పలికెడి దేవుడు
మ్రొక్కిన వారికి వరాలిచ్చు రాయుడు
గోవింద గోవింద గోవింద అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి
చూసిన వారికి కలుగును శాంతి
కళ్యాణము చేసిన వారికి ఎనలేని శుభము
గోవింద గోవింద గోవింద అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి
తలనీలాలకే తరగని సిరులిచ్చు
కాసిని కాసులకు కామధేనువునిచ్చు
గోవింద గోవింద గోవింద అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి
నడచిన వారికి కార్యము సఫలము
నామస్మరణము నిత్యము శుభము
గోవింద గోవింద గోవింద అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి
సుప్రభాతము శుభముకు బాట
పవళింపు పాట ఫలముల మూట
గోవింద గోవింద గోవింద అనండి
తిరుమల దేవుని కరుణ పొందండి
నారాయణ రావు
24 జూలై 2018