Tuesday, March 24, 2020

Corona Shivuda Shivuda - కరోనాకు మందు చెప్పి కాపాడయ్యా

శివ రాత్రి వచ్చింది శివుడా శివుడా
భవరాశి పిలిచింది శివుడా శివుడా

చైనాలో  జరిగింది శివుడా శివుడా
జంతు భక్షణ  పెరిగింది శివుడా శివుడా
కరోనా సోకింది శివుడా శివుడా
గబగబా పెరిగింది శివుడా శివుడా    | |శివ రాత్రి వచ్చింది

ముక్కులో మంట  శివుడా శివుడా
గొంతులో నొప్పి శివుడా శివుడా
ఊపిరి అందట లేదు  శివుడా శివుడా
ప్రాణం ఉండటలేదు  శివుడా శివుడా   | |శివ రాత్రి వచ్చింది

రాయుడు, రెడ్డి, రాజు చూసి వెళ్లారు
శర్మ, శాస్త్రి కూడా మాట్లాడారు
శ్రేష్టి గారు  డబ్బులు పంపిస్తారు
కానీ నా నొప్పి నెవరు  తగ్గిస్తారు | |శివ రాత్రి వచ్చింది

కాపాడు మా తండ్రి కాపాడయ్యా
కరోనాకు మందు చెప్పి కాపాడయ్యా
కాదంటే కష్టాలే శివుడా శివుడా
కైలాసం చేరడమే నా గతి అయ్యా  ||శివ రాత్రి వచ్చింది


No comments:

Post a Comment