Tuesday, February 21, 2012

శివరాత్రి జాగారం - Shivaraatri Jaagaaram



శివరాత్రి జాగారం 
సంఘ సంక్షేమ వ్యవహారం
అరిష్టాన్ని అడ్డుకునే సమిష్టి కార్యక్రమం 
నష్టాని ఆపే పెద్ద ప్రయత్నం 

సంఘానికి వచ్చిన కష్టం పెద్దది
సామాన్యుల వల్ల కానిది  
జరుగుతున్న నష్టాలు చాలా చాలా ఎక్కువ
ఆపడానికి ఉన్న శక్తి చాలా తక్కువ

శివుడంత వాడు రావాలి
సమస్యను బాగా చూడాలి
తన పూర్తి శక్తిని వాడాలి
స్వయంగా సమస్యతో పోరాడాలి

మరి జాగార మెందుకు
శివుడున్నాడుగా మనకు నిద్రభంగమెందుకు
అలసి పోయి ఉన్నాము
వెళ్లి విశ్రమిద్దాము

శివరాత్రి కధ వింటే తెలుస్తుంది కొంత
శివుడికీ కావాలి పార్వతి చెంత
సహాయం కావాలి
ప్రోత్సాహం కావాలి

శివుడు పెద్ద రాక్షసుడుతో యుద్ధం చేస్తుంటే
చిన్న రాక్షసులను ఎవరు ఆపుతారు 
ప్రజలంతా పడుకుంటే 
అంతా క్షేమం అనుకుంటే

మిగిలేది నాశనం
జరిగేది సర్వనాశనం
శివరాత్రి జాగారం 
సంఘ సంక్షేమ వ్యవహారం

మేలుకో మేలుకో
నిద్రమీద మమకారం మర్చిపో మర్చిపో
ఎదురుగా ఉన్న ఆపదను ఎదుర్కో ఎదుర్కో
శివుడుతో చెయ్యి కలిపి సమరం గెలుచుకో గెలుచుకో

No comments:

Post a Comment