Wednesday, August 15, 2018

Seva Cheyara Tammudaa

సిరులు ఇచ్చెడి జీవగడ్డఇది
సేవ చేయర తమ్ముడా
పాలు పంచే గోవులున్నవి
ప్రేమ చేయర తమ్ముడా

వేదం శాఖలు దారి చూపును
పురాణములు వివరించి చెప్పును
మునులు చెప్పిన మాట వినుము
మంచి బాటను ఎన్ను కొనుము

శిశ్యులడిగిన ప్రశ్నలకు
గురువులిచ్చిన సమాధానం
శ్రద్ధగా విని జపము చేసి
మంచి చేయర తమ్ముడా  

Friday, August 3, 2018

2018 August 15 Greetings - 2018 స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు



శుభాకాంక్షలు శుభాకాంక్షలు
భారతీయుడా శుభాకాంక్షలు
స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు

దాడులెన్నో చేసి
దారుణాలు జరిపి
నీ దేశం దహించిన
దూర దేశాల వాళ్ళను
ఎదురు నిలిచి
తిరిగి పంపిన
భారతీయుడా శుభాకాంక్షలు
స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు

ఓడినా వొంగక
కొట్టినా లొంగక
నా దేశం నా హక్కని
నీ దేశం నువ్వు పొమ్మని
భయము వదిలి
ఎదురు నిలబడి
జండాతో జట్లు జట్లుగా
జైలుకెళ్లి జయించి వచ్చిన
భారతీయుడా శుభాకాంక్షలు
స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు

అట్టడుగు నుండి
అడుగడుగు పైకి
ఆర్ధికంగా బలపడి
ఆశయాలకు నిలబడి
ఆశ్రితులను ఆదరించే
ఆదర్శ రాముడా
భారతీయుడా శుభాకాంక్షలు
స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు

(C) Narayana Rao 2018