శ్రీరామ శ్రీరామ శ్రీరామ - భజన గీతము
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
అంజలి నీకిదె అయోధ్యరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఆసనమిదె ఆశ్రిత వత్సల రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఇక్ష్వాకుకులతిలక ఇనవంశోధ్భవ రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఈప్సితదాయక ఇహలోక రక్షక
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఉడుత భక్తిని అతి చిన్న పనిని గుర్తించు ప్రభువా
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఊహించ తరమా నీ శక్తి యుక్తులను
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఎదిరించగల వాడు ఇహలోకమున లేడు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఏనుగు పిలిచిన భూమికి వఛ్చిన హరి అవతారామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఐశ్వర్య లక్ష్మిని సీతగ పొందిన ఆది పురుషుడవు సీతా రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఒంటరి వారికి అన్నీ నీవే
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఓంకార నాదానికి పలికే రామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఔదార్యమునకు నిలయము నీవు భక్తికి లొంగే దేవుడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
అంతఃకరణము ఆత్మ వెతకును నిన్నే
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
కష్టసుఖములు నావి కనిపెట్టే వాడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఖరభూషణులను ఖతము చేసిన వాడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
గరుడ వాహనుని అవతారము నీవు దశరధ రామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఘనకీర్తి గల రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
చక్కని రూపము చల్లని చూపులు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఛత్ర ఛాయలోన కొలువు చేసిన రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
జగదభి రామ జానకి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
త్యాగరాజనుత సంగీత ప్రియ రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
దయామయ రామ దానవ భంజక
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ధర్మప్రవర్తక ధర్మప్రభోధక రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
నన్నేలు శ్రీ రామ నరలోక పాలక
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
పవనసుత రక్షక పతిత పావన రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఫలమియ్య రావయ్య పిలిచితి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
బాలరాముడిగానే యాగరక్షకుడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
భధ్రుడిని బ్రోచిన భద్రాచల రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
మంచిని పెంచే మానవత్వము చూపిన రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
యజ్ఞాలు యాగాలు ఎన్నెన్నో చేసితివి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
రైతులందరు నీ దయ సుఖముగా నుండిరి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
లక్షణముగా గోవులు క్షీరము నిచ్చెడివి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
వర్షాలు వానలు సమయానికే వచ్చే
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శ్రీరామ నీనామ మెంతో ఫలమిచ్చు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
షడ్రుచులను మరిపించునంత తీపిర రామ నీ నామ భజన
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
సీతారామ జయ జయ రామ జానకి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
హర్షోల్లాసములు శ్రీరామ భజన ఫలములు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
28 March 2015 7.50 pm
శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని ఒక సారి అంటే సహస్రనామ పారాయణ ఫలితము లభిస్తుంది అని మీకు తెలిసే ఉన్టుంది. ఈ భజనలో అనేక సార్లు శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని సంతోషము పొందండి.
_______________
_______________
_______________
_______________
_______________
_______________
_______________
_______________
Updated 23 October 2016, 28 March 2015