Written on 15 Feb 015
శివరాత్రి శివుని చూసి వద్దాము రండి
లింగాభిషేకం చేసి వద్దాము రండి
శివ మహిమ గాధలు విందాము రారండి
శివ పూజ పుణ్యము పొంద కదలండి
శివుడు పుట్టిన రోజు నేడే అని కొందరు
లింగోద్భవము కూడా జరిగెనని కొందరు
శివ రాత్రి గాధలు యుగ యుగాల వింతలు
దినమంత విందాము భజనలు చేద్దాము ||శివ మహిమ గాధలు విందాము రారండి||
దక్ష ప్రజాపతి గారాల బాల శివసతిగ మారె
దక్ష యజ్ఞము లోన జరిగె సతి మరణము
హిమవంత తనయగా ఆదిశక్తి జననము
అత్యధ్బుతమైన శివపార్వతీ పరిణయము ||శివ మహిమ గాధలు విందాము రారండి||
శివ రాత్రి గాధలు యుగ యుగాల వింతలు
దినమంత విందాము భజనలు చేద్దాము
భగవదారాధనకు అతి పుణ్య దినము
శివరాత్రి శివునకు అతి ప్రీతికరము ||శివ మహిమ గాధలు విందాము రారండి||
అమర ఆనందము అమృత పానము
పొంద చేసిరి విశ్వ సముద్ర మదనము
విలువైన వస్తువులు వేల వేలు వచ్చే
ప్రలయధ్వనితో పుట్టె హాలాహల జ్వాల ||శివ మహిమ గాధలు విందాము రారండి||
రక్షించు రక్షించు దేవుడా దేవుడా
విశ్వమంతా అరిచే వినాశము జరిగె
భక్షించు భాద్యత శివుని వంతయ్యె
కడలి వచ్చెను శివుడు శివరాత్రి తిధిని ||శివ మహిమ గాధలు విందాము రారండి||
గరళము చేపట్టి నోటి లోపల పెట్టి
గుట కేసె ఈశ్వరుడు ప్రమదాది నాధుడు
గొంతులోనే పెట్టి కదలకుండగా చేసి
గరళాన్ని శాసించె కైలాస వాసుడు ||శివ మహిమ గాధలు విందాము రారండి||
శివ గరళ యద్ధము జరిగిన రాత్రి
శివగణములన్ని నిదురించని రాత్రి
ప్రకృతిపై పరమాత్మ విజయసంకేత రాత్రి
శివరాత్రి మనకు ఒక దివ్య రాత్రి ||శివ మహిమ గాధలు విందాము రారండి||
Updated on 7 March 2016