Friday, October 21, 2016

Shri Rama Shri Rama Shri Rama - శ్రీరామ శ్రీరామ శ్రీరామ భజన గీతము


శ్రీరామ శ్రీరామ శ్రీరామ - భజన గీతము


శ్రీరామ శ్రీరామ శ్రీరామ
అంజలి నీకిదె అయోధ్యరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఆసనమిదె ఆశ్రిత వత్సల రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఇక్ష్వాకుకులతిలక ఇనవంశోధ్భవ రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఈప్సితదాయక ఇహలోక రక్షక
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఉడుత భక్తిని అతి చిన్న పనిని గుర్తించు ప్రభువా
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఊహించ తరమా నీ శక్తి యుక్తులను
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఎదిరించగల వాడు ఇహలోకమున లేడు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఏనుగు పిలిచిన భూమికి వఛ్చిన హరి అవతారామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఐశ్వర్య లక్ష్మిని సీతగ పొందిన ఆది పురుషుడవు సీతా రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ

ఒంటరి వారికి అన్నీ నీవే
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఓంకార నాదానికి పలికే రామా
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఔదార్యమునకు నిలయము నీవు భక్తికి లొంగే దేవుడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
అంతఃకరణము ఆత్మ వెతకును  నిన్నే
శ్రీరామ శ్రీరామ శ్రీరామ

కష్టసుఖములు నావి కనిపెట్టే వాడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఖరభూషణులను ఖతము చేసిన వాడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
గరుడ వాహనుని అవతారము నీవు దశరధ రామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఘనకీర్తి గల రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ

చక్కని రూపము చల్లని చూపులు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఛత్ర ఛాయలోన కొలువు చేసిన రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
జగదభి రామ జానకి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ

శ్రీరామ శ్రీరామ శ్రీరామ

త్యాగరాజనుత సంగీత ప్రియ రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
దయామయ రామ దానవ భంజక
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ధర్మప్రవర్తక ధర్మప్రభోధక రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
నన్నేలు శ్రీ రామ నరలోక పాలక
శ్రీరామ శ్రీరామ శ్రీరామ

పవనసుత రక్షక పతిత పావన రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
ఫలమియ్య రావయ్య పిలిచితి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
బాలరాముడిగానే యాగరక్షకుడవు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
భధ్రుడిని బ్రోచిన భద్రాచల రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
మంచిని పెంచే మానవత్వము చూపిన రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ

యజ్ఞాలు యాగాలు ఎన్నెన్నో చేసితివి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
రైతులందరు నీ దయ సుఖముగా నుండిరి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
లక్షణముగా గోవులు క్షీరము నిచ్చెడివి
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
వర్షాలు వానలు సమయానికే వచ్చే
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
శ్రీరామ నీనామ మెంతో ఫలమిచ్చు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
షడ్రుచులను మరిపించునంత తీపిర  రామ నీ నామ భజన
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
సీతారామ జయ జయ రామ జానకి రామ
శ్రీరామ శ్రీరామ శ్రీరామ
హర్షోల్లాసములు  శ్రీరామ భజన ఫలములు
శ్రీరామ శ్రీరామ శ్రీరామ

28 March 2015 7.50 pm

శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని ఒక సారి అంటే సహస్రనామ పారాయణ ఫలితము లభిస్తుంది అని మీకు తెలిసే ఉన్టుంది. ఈ  భజనలో అనేక సార్లు  శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని సంతోషము పొందండి.



_______________

_______________


_______________

_______________


_______________


_______________


_______________

_______________


Updated 23 October 2016, 28 March 2015



Tuesday, March 22, 2016

Holi Poem - होली के दिन आये हैं हम




Picture source:
http://cdn.morguefile.com/imageData/public/files/j/JessicaGale/09/l/1410406854w183a.jpg

होली के दिन आये हैं हम
पिचकारी भर खुशियाँ  लाये हैं  हम
सुख संकेत रंग डालेंगे हम
आनंद हमारा बाटेंगे हम

तकलीफ सब  दहन हो गया  कल
सुख का ही अब  सोच हर पल
घर से निकल कर बोलता ही चल
होली का दिन आज फेंकने दे  जल

कर सबसे दोसती आज
मांगले माफी मिटादे दूरी
नजदीक जावे  रंग   लगावे
 शुभ शुभ होली गाना गावे



Short url: http://goo.gl/OyDo9J

Written on 22 March 2016

Sunday, March 13, 2016

I am Indian Who Wants World's Welfare - Poem



I am Indian
taught by Divine
I believe in union
with God and his Creation


I guard the ground of my own
that does not mean fight with alien
I help my brothern
does not mean rest of  the world I disown

I am ready to help people anywhere
always help neighbours to prosper
I take care of  my land's weak labour
its only makes world stronger

Global trade should not mean disaster
competition should not mean human hunger
share your means and live till God's desire
I am an Indian who wants world's welfare


Written on 13 March 2016, Sunday


Support World Poetry Day - 21 March


Tuesday, March 8, 2016

Shivratri Shivuni - శివరాత్రి శివుని చూసి వద్దాము రండి

Written on 15 Feb 015




శివరాత్రి శివుని చూసి వద్దాము రండి
లింగాభిషేకం చేసి వద్దాము రండి
శివ మహిమ గాధలు విందాము రారండి  
శివ పూజ  పుణ్యము పొంద కదలండి

శివుడు పుట్టిన రోజు నేడే అని కొందరు
లింగోద్భవము కూడా జరిగెనని కొందరు
శివ రాత్రి గాధలు యుగ యుగాల వింతలు
దినమంత విందాము భజనలు చేద్దాము      ||శివ మహిమ గాధలు విందాము రారండి||

దక్ష ప్రజాపతి గారాల బాల శివసతిగ  మారె
దక్ష యజ్ఞము లోన జరిగె  సతి మరణము
హిమవంత తనయగా ఆదిశక్తి జననము
అత్యధ్బుతమైన శివపార్వతీ పరిణయము  ||శివ మహిమ గాధలు విందాము రారండి||

శివ రాత్రి గాధలు యుగ యుగాల వింతలు
దినమంత విందాము భజనలు చేద్దాము
భగవదారాధనకు అతి పుణ్య దినము
శివరాత్రి శివునకు అతి ప్రీతికరము    ||శివ మహిమ గాధలు విందాము రారండి||

అమర ఆనందము అమృత పానము
పొంద చేసిరి  విశ్వ సముద్ర మదనము
విలువైన వస్తువులు వేల వేలు వచ్చే
ప్రలయధ్వనితో పుట్టె హాలాహల జ్వాల  ||శివ మహిమ గాధలు విందాము రారండి||

రక్షించు రక్షించు దేవుడా దేవుడా
విశ్వమంతా అరిచే వినాశము జరిగె
భక్షించు భాద్యత శివుని వంతయ్యె
కడలి వచ్చెను శివుడు శివరాత్రి తిధిని  ||శివ మహిమ గాధలు విందాము రారండి||

గరళము చేపట్టి నోటి లోపల పెట్టి
గుట కేసె  ఈశ్వరుడు  ప్రమదాది నాధుడు
గొంతులోనే పెట్టి కదలకుండగా చేసి
గరళాన్ని శాసించె కైలాస వాసుడు  ||శివ మహిమ గాధలు విందాము రారండి||

శివ గరళ యద్ధము జరిగిన రాత్రి
శివగణములన్ని నిదురించని రాత్రి
ప్రకృతిపై పరమాత్మ విజయసంకేత రాత్రి
శివరాత్రి మనకు ఒక దివ్య రాత్రి    ||శివ మహిమ గాధలు విందాము రారండి||



Updated on 7 March 2016