శ్రీ రాముడు భద్రాచల రాముడు
తల్లి మాట జవ దాటని రాముడు
తండ్రి మాట శిర దాల్చిన రాముడు
గురుని బాటనే నడచిన రాముడు
శ్రీ రాముడు భద్రాచల రాముడు
అడవిని అయోధ్య చేసిన రాముడు
మునుల బాధలను తీర్చిని రాముడు
రాక్షస మూకల సంహార రాముడు
అడవి జనులకు ఆహ్లాద రాముడు
శ్రీ రాముడు భద్రాచల రాముడు
హనుమ హృదయ విహార రాముడు
సుగ్రీవ క్లెశ హరణ రాముడు
దశ ముఖ మర్దన ధనుర్భాణ రాముడు
జానకి నాధుడు జగన్నాధ రాముడు
శ్రీ రాముడు భద్రాచల రాముడు
అహల్య శాపము బాపిన రాముడు
గోపన్న చెర తప్పించిన రాముడు
విభీషణ సఖుడు శరణాభి రాముడు
భద్రుడు నిలిపిన ఆంధ్రుల రాముడు
శ్రీ రాముడు భద్రాచల రాముడు