మరిచిపోదు మా తరం
మన చరిత్రలోని అపస్వరం
పరాయి దేశ పాలకులు సాగించిన దుష్కరం
భారతమాత జీవితంలో వొక చేదు అనుభవం
విజయనగర పాలకుల దక్షిణంలో విజయం
శివాజీ నాయకత్వం అనేక కోటల ఆధిపత్యం
సన్యాసుల విప్లవం వందే మాతరం నినాదం
అల్లూరి అమర సమరం ఆంధ్రాలో విప్లవం
ఝాన్సీ రాణి వీరమరణం
వేల సిపాయిల జీవన దానం
స్వరాజ్యం నా జన్మ హక్కని తిలక్ ఇచ్చిన నినాదం
భారత దేశం వదిలి పొండని గాంధి ఇచ్చిన ఆదేశం
అనేక యోధుల ప్రాణదానం మనకు మరల వచ్చిన స్వాతంత్ర్యం
భారత మాతకు వైభవాన్ని తిరిగి తేవడం మన కర్తవ్యం
మనమంతా భారత మాత బిడ్డలం భారతీయులం
హిందూస్తాన్ వాసులం హిందువులం
దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయి
గురజాడ మాటలు మరచిపోం
తోటి వానికి గట్టి మేలు తలపెట్టమని మహనీయులు
చెప్పిన మాట కూడా మర్చిపోం
నా ప్రాణం, నా సౌఖ్యమ్
నా కుటుంభం, మా సంపద
నా దేశం, దేశ సౌభగ్యమ్
విశ్వం కూడా నా దేనని మరచిపోం మరచిపోం
15 ఆగష్టు 2014