Monday, June 11, 2012

Jola pata jojo mahalakshmi - జో లక్ష్మి శ్రీ లక్ష్మి జో జో మహా లక్ష్మీ



జో లక్ష్మి శ్రీ లక్ష్మి జో జో మహా లక్ష్మీ
జోల పాటల ప్రియా, బాలేందు వదనా

అందరి ఆకలి తీర్చు అన్నపూర్ణవు నీవు
అన్ని వసతులు కూర్చు గృహ లక్ష్మి నీవు
చదువుల సరస్వతివి, రణమునకు రాణివి
అవతార మూర్తివి, అద్వితీయ శక్తివి

సముద్రరాజ తనయా సర్వ సంపత్కరీ
హిమగిరి తనలా మోహాంధ నాశనీ
బ్రహ్మ మానస తనయా వేదాల దేవీ
త్రిగుణ త్రయీ , త్రిశక్తి స్వరూపిణీ

ఆది దేవుళ్ళను ఆడించిన అమ్మ అనసూయ తల్లీ
అసురాన్తవు  నీవు శ్రీ సత్య వల్లీ
శివ ధనస్సును జరుపు శక్తిశాలివి సీతమ్మ తల్లీ
కనులార్పు నా అమ్మ , నను కన్నా తల్లీ

అలసితివి సొలసితివి ఆలస్యమేలా
ఆటలాడగ నీవు సమయమే లేదా
పవళింపు వేళాయే పరిహాస మేలా
విశ్రమిమ్పుము తల్లి వైకుంఠ లక్ష్మీ

నారాయణ రావు 
10.6.2012
హైదరాబాదు నుండి ముంబాయి వచ్చిన ప్రయాణము లో